బతుకమ్మ చీరెలతో ఆడబిడ్డల్లో ఆనందం


Sun,October 6, 2019 02:48 AM

భీమారం,అక్టోబర్05: తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరెలతో ఆడబిడ్డల్లో ఆనందం వెల్లివిరుస్తోందని 57,58వ డివిజన్ కార్పొరేటర్లు జక్కుల వెంకటేశ్వర్లు, బానాతు కల్పన అన్నారు. భీమారం కార్పొరేషన్ కార్యాలయంలో, పెగడపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరెలతో ఆడబిడ్డలు సంతోష పడుతున్నారని, సీఎం కేసీఆర్ అన్నలా ఆలోచించి అడపడుచులందరికీ పండుగ కానుకను అందించారని అన్నారు. కార్యక్రమంలో ఎర్రగట్టుగుట్ట దేవాలయ చైర్మన్ అటికం రవీందర్‌గౌడ్, జిల్లా ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు సంగాల విక్టర్‌బాబు, మాజీ సర్పంచ్ నరెడ్ల శ్రీధర్, టీఆర్‌ఎస్ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి రమేశ్‌యాదవ్, నాయకులు శివరాం ప్రసాద్, ఆకుల కుమార్, చింతల రమేశ్, రాయకంటి సురేశ్, నాతి సమ్మయ్య, కమలమ్మ, కుమార్‌యాదవ్, ఇనుముల నాగరాజు, మహేందర్‌యాదవ్, పేరం కొమురెల్లి, తుల రవి, బాలరాజు, స్వరూప, లచ్చమ్మ, విజయ పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...