హైందవ ధర్మంలో స్త్రీ శక్తి స్వరూపం


Sat,October 5, 2019 04:10 AM

రెడ్డికాలనీ, అక్టోబర్ 04: హిందూ జీవన విధానంలో స్త్రీని అమ్మ అంటారని, హైందవ ఇతిహాసాల్లో, పురాణాల్లో, వేదాల్లో, శాస్ర్తాల్లో స్త్రీ ప్రకృతికి ప్రతిరూపమని, శక్తి స్వరూపమని అందుకే నవరాత్రులకు విశేష ప్రాధాన్యం ఉందని విశాఖ శ్రీశారద పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి అన్నారు. హంటర్‌రోడ్డులోని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజశ్యామల అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు చేసి కుంకుమ పూజ, రుద్రాభిషేకం నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు దంపతులు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు దంపతులు, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ దంపతులు, ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు, తెలంగాణ జాగృతి కన్వీనర్ కోరబోయిన విజయ్‌కుమార్, బల్మూరి జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...