కాజీపేట ఐటీఐలో ఆయుధ పూజ


Sat,October 5, 2019 04:10 AM

కాజీపేట, అక్టోబర్ 04: కాజీపేట ఐటీఐలో శుక్రవారం సద్దుల బతుకమ్మ, దసరాను పురస్కరించుకుని బతుకమ్మ సంబురాలు, ఆయుధ పూజ నిర్వహించారు. ఐటీఐ ప్రిన్సిపాల్ అశోక్‌కుమార్, విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతి ట్రేడ్‌లో యంత్రాల(పనిముట)్లకు ప్రత్యేక ఆయుధ పూజలు చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం కళాశాల ఆవరణలో విద్యార్థినులు బతుకమ్మ ఆట ఆడారు. కార్యక్రమంలో ఐటీఐ సూపర్‌వైజర్ మోహన్‌సింగ్, ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్లు చంద్రమోహన్, సతీశ్, రజిత, సంధ్యారాణి, మాలతి, హతియా పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...