మహాలక్ష్మీదేవికి రూ.లక్షా 16వేలతో అలంకరణ


Sat,October 5, 2019 04:09 AM

కాశీబుగ్గ, అక్టోబర్04: నగరంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీరంగనాథస్వామి దేవాలయంలో శ్రీదేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రూ.లక్షా 16వేలతో అమ్మవారిని అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానరేంద్ర సరస్వతి స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో అడ్‌హక్ కమిటీ కోకన్వీనర్లు ఆరుట్ల కృష్ణమాచార్యులు, రామాచార్యులు, వంగరి రవి, మిట్టపల్లి సదానందం, వద్దిరాజు వెంకటేశ్వర్‌రావు, రమేశ్, వంగరి సమ్మయ్య, గంగిడి ధర్మారెడ్డి, మహిళా సేవాదల్ సభ్యులు సుల్తాన్ సమ్మక్క, మంచాల సృజన, కోల కవిత, చిలుపూరి రజని, కూరపాటి రోజా, సామల ఉమ, శ్రీరాముల పుష్పలీల, కట్ట సీత పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...