సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి


Sat,October 5, 2019 04:09 AM

సిద్ధార్థనగర్, అక్టోబర్04: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని తిరుమల హెల్త్‌క్లబ్ చైర్‌పర్సన్ రాగిడి అనితాతిరుపతిరెడ్డి అన్నారు. శుక్రవారం హన్మకొండ కేయూ జంక్షన్‌లోని కందకట్ల కాంప్లెక్స్‌లో కనకదుర్గ గ్రూప్, తిరుమల హెల్త్‌క్లబ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనితాతిరుపతిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఆడపడుచులకు ఎంతో ఇష్టమైన పండుగని, ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం మహిళలు తెలంగాణ సంప్రదాయాలను తెలియపరిచే విధంగా దుస్తులు ధరించి, బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడడంతో కాంప్లెక్స్ ఒక్కసారిగా సందడిగా మారింది. కార్యక్రమంలో కనకదుర్గ గ్రూప్స్ మెనేజింగ్ డైరెక్టర్ కమలాకర్‌రెడ్డి, డిప్యూటీ ఎండీ కే సదానందంతో పాటు మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...