జగతికి మూలాధారం అమ్మ


Fri,October 4, 2019 03:01 AM

-విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానంద్రేంద్ర స్వామి
అర్బన్ కలెక్టరేట్, అక్టోబర్ 03: అమ్మకు ఎన్నో నామాలు, రూపాలు ఉన్నాయని, సరస్వతిగా, లక్ష్మిగా, కాళికగా అమ్మవారు త్రిలోక జననిగా, ఆధిపరాశక్తిగా కనిపిస్తూ ముల్లోకాలను రక్షిస్తుందని విశాఖ శ్రీ శారాదా పీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానంద్రేంద్ర సరస్వతి స్వామిజీ అన్నారు. హంటర్‌రోడ్డులోని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వీ లక్ష్మీకాంతారావు నివాసంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారి విగ్రహాకి రుద్రాభిషేకం నిర్వహించి, చండీ పారాయణం, చండీహోమం చేశారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ అమ్మవారు నాద రూపంలో మనలో ఉంటేనే మనం శబ్దరూపంలో మాట్లాడగలుగుతున్నామని, వినబడని నాదంలోంచి ఓంకారం వచ్చిందని ఓంకారంలోంచి వేదాలు, వేదాల్లోంచి శాస్త్రాలు వచ్చాయని అన్నారు. అనంతరం చేపట్టిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు దంపతులు, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వీ సతీశ్‌కుమార్ దంపతులు, కరీనంగర్ జెడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాల్‌రావు, హుజురాబాద్ క్లబ్ అధ్యక్షుడు శ్రీరాంరెడ్డి, వావిలాల ఖాదీ బోర్డు డైరెక్టర్ రాంచంద్రారెడ్డి, కార్పొరేటర్లు వద్దిరాజు గణేశ్, మాధవిరెడ్డి, ఫిరంగి సునీల్ తదితరులు పాల్గొన్నారు.

వీరభద్రుడి సన్నిధిలో పూజలు..
భీమదేవరపల్లి: కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయంలో గురువారం సాయంత్రం శ్రీ విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్మాత్మానందేంద్ర సరస్వతి స్వామిజీ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయ ఆవరణలో రుద్రాక్ష మొక్కను నాటారు. అక్కడి నుంచి కొప్పూరులోని పంచముఖ ఆంజనేయస్వామి గుట్టపై ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, ఆలయం ఈవో ఉడుతల వెంకన్న, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ చైర్మన్ కాసం రమేశ్, భక్తులు పాల్గొన్నారు.

మెట్టుగుట్ట సందర్శన
మడికొండ : మడికొండ మెట్టుగుట్ట క్షేత్రాన్ని గురువారం విశాఖ శ్రీశారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంభూ శ్రీమెట్టురామలింగేశ్వరస్వామికి పంచామృతాలచే అభిషేకం జరిపించారు. అలాగే శ్రీసీతారామచంద్రస్వామికి విశేష పుష్పార్చన చేపట్టారు. అంతకుముందు నూతనంగా నిర్మిస్తున్న సరస్వతి దేవాలయాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తొట్ల రాజుయాదవ్, ఈవో వీరస్వామి, అర్చకులు అభిలాశ్‌శర్మ, రామాచార్యులు, విష్ణువర్ధనాచార్యులు, సత్యనారాయణశర్మ, చైర్మన్ అల్లం శ్రీనివాసరావు-కవిత, భక్తులు రాధికానరోత్తంరెడ్డి, శ్యాంసుందర్, రమేశ్, శ్రీనివాసులు, జగదీశ్వర్, వెంకటేశ్వర్లు ఉన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...