ఏకగ్రీవ పంచాయతీలకు అదనపు నిధులు


Fri,October 4, 2019 03:01 AM

హసన్‌పర్తి/భీమదేవరపల్లి, అక్టోబర్ 03: ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకంగా అదనపు నిధులు కేటాయిస్తామని కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ అన్నారు. మండలంలోని సిద్ధ్దాపూర్, బైరాన్‌పల్లి, భీమదేవరపల్లి మండలంలోని గాంధీనగర్, మాణిక్యాపూర్ గ్రామాల్లో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక నిర్వహణ పనులను ఆయన పరిశీలించారు. ఆయా గ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ పనులను పరిశీలించారు. సిద్ధాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఏపుగా పిచ్చి మొక్కలు పెరగడంతో ఆయన సిబ్బందిపై సీరియస్ అయ్యారు. బైరాన్‌పల్లిలో భూసమస్యలపై రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 95శాతం మొక్కలను సంరక్షిస్తే గ్రామాలకు సరిపడా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గాంధీనగర్‌లో డంపింగ్‌యార్డు సమస్యపై గ్రామస్తులు చర్చించుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుకు కృషి చేయాలన్నారు.

కార్యక్రమంలో మండల స్పెషలాపీసర్ దామోదర్‌రెడ్డి, ఎంపీడీవోలు వేణుగోపాల్‌రెడ్డి, లంకపల్లి భాస్కర్, గ్రామ ప్రత్యేకాధికారి ప్రశాంత్, జెడ్పీటీసీ రేణికుంట్ల సునీత, ఎంపీపీ కేతపాక సునీత, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్‌రెడ్డి, సర్పంచులు కుందూరు సాంబరెడ్డి, తాళ్లపల్లి తులసమ్మ, వేల్పుల రవి, ఎంపీటీసీలు జట్టి మంజుల, మామిండ్లపల్లి గోపిశర్మ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి రజనీకుమార్, మాజీ సర్పంచ్ జట్టి కిరణ్‌కుమార్, నాయకులు ప్రశాంత్, ఇంద్రారెడ్డి, ఉపసర్పంచులు అనపురం శ్రీనివాస్, సదానందం, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, స్పెషల్ అధికారి సతీశ్, పీఆర్ డీఈ శంకరయ్య, ఎంపీవో శ్యాంకుమార్, పంచాయతీ కార్యదర్శులు గబ్బెట స్వామి, శ్రీనాథ్ పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...