కులమతాలు ఎయిడ్స్ కన్నా ప్రమాదకరం


Fri,October 4, 2019 03:01 AM

హసన్‌పర్తి, అక్టోబర్ 3: కులమతాలు ఎయిడ్స్ కన్నా ప్రమాదకరమని సమతా సైనిక్ దళ్ జాతీయ సమన్వయకర్త దిగంబర్‌కాంబ్లే అన్నారు. స్థానిక శ్రీశుభమస్తు గార్డెన్స్‌లో గురువారం నాస్తిక నాయకుల సమ్మేళనం రెండో రోజు భారత నాస్తిక సమాజం నిర్వహించింది. సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ కులమతాల నివారణకు మందు నాస్తికత్వమేనని అన్నారు. యువనాయకులందరు నిరంతరం అధ్యయనం చేస్తూ గొప్ప విద్యావంతులుగా ఉపన్యాసకులుగా మెజీషియన్‌గా, కళాకారుడిగా తమను తాము తీర్చిదిద్దుకోవాలన్నారు. కులమతాల పుట్టుక వాటి నిర్మూలన ఆవశ్యకత అనే అంశంపై ప్రముఖ ఉపన్యాసకులు జిలుకర శ్రీనివాస్ నాస్తిక నాయకులకు బోధించారు. విద్యావేత్త జి.లక్ష్మయ్య విద్యారంగం శాస్త్రీయ దృక్పథం అనే అంశంపై అవగాహన కల్పించారు. రాజేష్ తన పాటలతో యువతను ఉర్రూతలూగించారు. విత్తనాల చంద్రయ్య అచ్యుతరాజులు పలు మ్యూజిక్ ప్రదర్శనలు చేసి సమాజంలో మూఢనమ్మకాల పేరుతో ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు చూపించారు. కార్యక్రమంలో పల్లం తాతయ్యగోవిందులు, రమాప్రభు, సునీత, శ్యామల, నటరాజుసుందరం, భూంపల్లి మదు, నరేశ్, ప్రవీణ్, అనిత, సుజాత, మౌనిక, మహేశ్‌రైట్ తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...