కార్యకర్తలకు అండగా ఉంటా..


Fri,October 4, 2019 03:00 AM

మడికొండ, అక్టోబర్ 03: కార్యకర్తలకు అండగా ఉంటానని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. 34వ డివిజన్ రాంపూర్ టీఆర్‌ఎస్ గ్రామశాఖ కమిటీ గురువారం ఎమ్మెల్యేను తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో కార్పొరేటర్ జోరిక రమేశ్, తక్కళ్లపల్లి రాంగోపాల్‌రావు, విజయ్‌కుమార్‌రావు, దేవేందర్, అలువాల సురేశ్, రవి, సదానందం, రాజు, కుమార్, సాంబరాజు, శ్రీను, రాంచందర్, మారగోని రవి తదితరులు ఉన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...