స్కందమాతగా భ్రమరాంబికాదేవి


Fri,October 4, 2019 03:00 AM

ఐనవోలు అక్టోబర్ 03 : ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాయలంలోని ఉప దేవాలయంలో భ్రమరాంబికాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం భ్రమరాంబికాదేవి స్కందమా త అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ముఖ్య అర్చకులు పాతర్లపాటి రవీందర్, వేదపండితుడు పురుషోత్తమ్మశర్మ, పురోహిత్ మధుకర్‌శర్మ ఆధ్వర్యంలో ఉదయం నిత్యాహ్నికము నవవర్ణార్చన బావనోపనిషత్ చేశారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఈవో అద్దెంకి నాగేశ్వర్‌రావు ఏర్పాట్లు చేశారు. పూజ కార్యక్రమంలో అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్‌శర్మ, దేవగిరి బీమన్న, శ్రీనుశర్మ, మధు శర్మ, నరేశ్‌శర్మ, భానుప్రసాద్‌శర్మలు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...