సాగు విస్తీర్ణాన్ని నమోదు చేయాలి


Fri,October 4, 2019 03:00 AM

ములుగు, నమస్తేతెలంగాణ : ఈ నెల 10 లోగా వ్యవసాయ అధికారులు రైతుల భూములకు సంబంధించిన సాగు విస్తీర్ణం వివరాలను పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ఆదేశించారు. సాగు విస్తీర్ణం వివరాలు, సంబంధిత అంశాలపై ఆయన గురువారం వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్‌బొజ్జతో కలిసి అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 ఖరీఫ్ పంట వివరాలను రైతు బంధు పోర్టల్‌లో నమోదు చేయాలని అన్నారు. రైతుల కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను క్షేత్ర స్థాయిలో పకడ్భందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా పట్టా దారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేసిన రైతుల వివరాలు సేకరించి రైతు భీమా పథకం అందే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. 2019 సాగు విస్తీర్ణ అంచాన ప్రకారం ఎరువుల సరఫరాకు అవసరమైన ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల వద్ద నుంచి పూర్తి స్థాయిలో పండిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నందున ఇతర ప్రాంతాలకు చెందిన దళారులు ఇక్కడ విక్రయించే అవకాశాలు ఉన్నాయని, వాటిని నివారించే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రా రైతులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో కూతాటి రమాదేవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె.ఏ. గౌస్‌హైదర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...