గాంధీజీ ఆశయాలను కొనసాగించాలి


Thu,October 3, 2019 02:44 AM

-రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్
-పాలనలో మతం చొరబాటు అనైతికం
-ప్రొఫెసర్ అచిన్ వినాయక్
-మతం మనుషుల మధ్య సయోధ్య వారధి కట్టాలి
-తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్
-మహాత్మాగాంధీకి నేతలు, ప్రముఖుల ఘన నివాళి

భీమదేవరపల్లి: గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని స్థానిక ఎంపీపీ జక్కుల అనిత రమేశ్ పిలుపునిచ్చారు. బుధవారం జాతిపిత మహాత్మగాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీడీవో కార్యాలయంలో ఆమె గాంధీచిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సత్యం-అహింస గూర్చి ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు మహాత్మగాంధీ అని కొనియాడారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ జంగ లక్ష్మినారాయణ, ఎంపీటీసీలు ఎజ్రా, పద్మ, గోపి, రమాదేవి, కౌసల్య, మహ్మద్ అలీ మహ్మద్, సురేందర్, ఎంపీడీవో భాస్కర్, ఎంపీవో శ్యాంకుమార్, ఎస్డీఎల్‌సీఈ డైరెక్టర్ వీరన్ననాయక్, గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.

ఎల్కతుర్తిలో...
ఎల్కతుర్తి: జాతి పిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మేకల స్వప్న ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీవో తూర్పాటి సునీత, వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, డీటీ వెంకటస్వామి, ఈఓపీఆర్డీ జయంత్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

హసన్‌పర్తిలో...
హసన్‌పర్తి : మండలంలోని 15 పంచాయతీ గ్రామాలతో పాటు 10 విలీన గ్రామాలలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో వాసవి క్లబ్ ఆఫ్ హసన్‌పర్తి ఆధ్వర్యంలో ఆత్మకూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ చకిలం రాజేశ్వర్‌రావు, వినియోగదారుల సమాచారం కేంద్రం చైర్మన్ అనుమాండ్ల విద్యాసాగర్‌లు గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు భాస్కర్, వాసవి క్లబ్ ప్రతినిధులు భీష్మనాథం, కృష్ణమూర్తి, సంతోశ్‌రాజ్, శ్రీకాంత్, రవీందర్‌రెడ్డి, సుధీర్, శ్యాంసుందర్, రాజన్న, వెంకటేశ్వర్లు, కిశోర్, పండ్ల వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

-ఆరెపల్లిలో వినూత్న రీతిలో నిరసన
గాంధీ జయంతిని పురస్కరించుకొని 1వ డివిజన్ ఆరెపల్లిలో గ్రామాభివృద్ధి పనులపై గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ కన్వీనర్ సుంకరి ప్రశాంత్ ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అధికారులు స్పందించి గ్రామ సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు కృష్ణమూర్తి, సాంబయ్య, రాజు, నిజామ్, లక్ష్మణ్, బిజిలి, సంపత్, కేత, రాజుకుమార్, ఓంకార్, కిశోర్ పాల్గొన్నారు.

కమలాపూర్‌లో...
కమలాపూర్: మండలంలోని కమలాపూర్, ఉప్పల్, శనిగరం, మర్రిపెల్లిగూడెం, అంబాల, గూడూరు, శ్రీరాంలపల్లి, వంగపల్లి, కన్నూరు, భీంపల్లి, నేరెళ్ల, కానిపర్తి, శంభునిపల్లి, దేశరాజ్‌పల్లి, గోపాల్‌పూర్ తదితర గ్రామాల్లో గాంధీజీ 150 జయంతి వేడుకలను గ్రామపంచాయతీ కార్యాలయాల్లో బుధవారం ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాణి, సర్పంచ్ కట్కూరి విజయారెడ్డి, ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎంపీవో రవిబాబు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీలు రాధిక, వెంకటేశ్వర్లు, నాయకులు తిరుపతిరెడ్డి, శ్రీకాంత్, టీఆర్‌ఎస్‌వి మండల అధ్యక్షుడు రాజ్‌కుమార్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

మడికొండలో...
మడికొండ : మడికొండలో బీజేపీ 34వ డివిజన్ అధ్యక్షుడు పొనుగోటి వెంకట్‌రావు ఆధ్వర్యంలో 150వ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్వచ్ఛభారత్, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, నాయకులు కొత్త రవి, ఆలకుంట ఎల్లయ్య, రావుల కిషన్, రామలింగం, రవీందర్‌రెడ్డి, మాదాసు ప్రణయ్, బాలరాజ్, బైరి సతీశ్, సురేశ్, సునీల్, మహేందర్, యుగేందర్ పాల్గొన్నారు. అలాగే మడికొండలోని బురుజు వద్ద వైశ్య సంఘం ఆధ్వర్యంలో మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ ఆవాల రాధికారెడ్డి హాజరై గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బెలిదె కిషన్, జ్ఞానేశ్వర్, రామకృష్ణ, సమ్మయ్య, శ్రీనివాసులు, మురహరి, వాసుదేవ్, సూర్యప్రకాశ్, ప్రవీణ్‌కుమార్, నాగేశ్వర్‌రావు, నర్సింహారావు, సంతోష్, గురుపతి, రఘు, దేవేంద్, ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.

ధర్మసాగర్‌లో...
ధర్మసాగర్ : మండలంలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కర్ర సోమిరెడ్డి, వేలేరు మండల సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కాయిత మాధవరెడ్డి గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ముప్పారం ప్రాథమిక పాఠశాలలో పెద్ది రమేష్-మంజుల దంపతులు గాంధీ విగ్రహాన్ని బహూకరించగా పాఠశాలలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎంఈవో సాయిబాబు విచ్చేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్, సర్పంచ్ సమ్మక్క, ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జవహార్‌రెడ్డి, ఎంపీపీ నిమ్మ కవిత, పలువురు అధికారులు, ఎంపీటీసీలు గాంధి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయా గ్రా మా ల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
ఐనవోలులో...
ఐనవోలు : మండలంలోని ఒంటిమామిడిపల్లి, ఐనవోలు మండల కేంద్రాల్లో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. మండలంలోని అన్ని పాఠశాల ఉపాధ్యాయులు, ప్రభుత్వ కార్యాలయాలు గాంధీజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మార్నేని మధుమతి, తహసీల్దార్ జగత్‌సింగ్, ఎంపీడీవో వెంకటరమణ, సర్పంచులు ఫోరం మండల అధ్యక్షుడు దయాకర్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...