ప్లాస్టిక్ రహితంగా బాలసముద్రం మార్కెట్


Thu,October 3, 2019 02:41 AM

వరంగల్,నమస్తేతెలంగాణ: జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా హన్మకొండ బాలసముద్రం రైతు బజార్‌ను ప్లాస్టిక్ రహిత మా ర్కెట్‌గా ప్రకటిస్తున్నట్లు గ్రేటర్ కమిషనర్ రవికిరణ్ తెలిపారు. బుధవారం లయన్స్ క్లబ్ అధ్వర్యంలో సుమారు 3 వేల ఎకో ఫ్రెండ్లీ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రవికిరణ్ మా ట్లాడుతూ.. 50 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ను వినియోగించడంతో పర్యావరణానికి కలిగే నష్టాలపై వివరించారు. బాలసముద్రం మార్కెట్‌కు వచ్చే ప్రజలు ఎకో ఫ్రెండ్లీ సంచులు తీ సుకురావాలని అన్నారు. సామాజిక స్పృహతో 3వేల ఎకో ఫ్రెండ్లీ బ్యాగులు, వంద బిన్లను అందజేసిన లయన్స్ క్లబ్ సభ్యులను కమిషనర్ అభినందించారు. కార్యక్రమంలో ఎంహెచ్‌వో డాక్టర్ రాజారెడ్డి, లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ పోట్లపల్లి శ్రీనివాస్‌రావు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు మందుల నరసింహారావు, రఘెత్తమ్‌రెడ్డి, నాగేశ్వర్‌రావు, మూల శ్రీనివాస్, సురేశ్, మనోహర్‌రావు, పాల్గొన్నారు.

ప్లాస్టిక్ రహిత కాలనీగా భవానీ నగర్
గ్రేటర్‌లోని 5వ డివిజన్ భవానీనగర్ కాలనీవాసులు ప్లాస్టిక్ రహిత కాలనీగా ప్రకటించినట్లు ఎంహెచ్‌వో డాక్టర్ రాజారెడ్డి తెలిపారు. కాలనీవాసులు సమావేశమై పర్యావరణానికి నష్టం కలిగించే పాస్టిక్‌ను వినియోగించకూడదని తీ ర్మాణం చేసినట్లు ఆయన తెలిపారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...