ప్రేమగా వ్యవహరించినప్పుడే ధర్మం నిలుస్తుంది


Thu,October 3, 2019 02:41 AM

కాజీపేట : ప్రపంచంలో కల్మషం లేని మనస్సుతో ప్రేమగా వ్యవహరించినప్పుడే సరైన ధర్మం నిలుస్తున్నదని శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ అన్నారు. కాజీపేట పట్టణంలోని శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం అమ్మవారికి జరుతున్న పూజా కార్యక్రమంలో స్వామీజీ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ప్రేమ గుణాన్ని కలిగి యుండాలని, తాము ప్రేమగా ఉన్నప్పుడే ఇతరుల ద్వారా ప్రేమను పొందుతారని చెప్పారు. తల్లిదండ్రులను పూజించడం, పెద్దలను గౌరవించడం వల్ల ధర్మం ఇంకా వికసిస్తుందని ఆయన తెలిపారు. అంతకు ముందు దేవాలయంలో అమ్మవారిని కుష్మాండ క్రమంలో చేశారు. త్రిగుళ్ల శ్రీనివాస శర్మ, ఆధ్వర్యంలో అయివోలు వెంకటేశ్వర శర్మ- పుష్పలత దంపతులు కలశ స్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో మల్లయ్యశర్మ -శారద, రాధాకృష్ణ శర్మ- మహతి, సాయికృష్ణ శర్మ -కల్యాణి , వెంకటేశ్వర్లు-పుష్పలత దంపతులు, స్థానిక కార్పోరేటర్ జక్కుల రమా- రవీందర్ యాదవ్ పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...