గ్రామ స్వరాజ్యమే లక్ష్యం


Thu,October 3, 2019 02:41 AM

దుగ్గొండి : పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయన ఆశయ సాధనకు దేశంలోని ప్ర తిష్టాత్మకమైన నిట్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు గ్రామాభివృద్ధే లక్ష్యంగా మండలంలోని ముద్దునూరు గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరిత మాట్లాడారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా గ్రామాన్ని దత్తత తీసుకుని సేవ చేసి గ్రామస్తుల స్తితిగతులను అధ్యాయనం చేసేందుకు గ్రామానికి వచ్చిన విద్యార్థుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా నిట్ విద్యార్థులు, అధ్యాపక బృందం సుమారుగా 200 మంది విద్యార్థులు 20 మంది అధ్యాపకులు గ్రామానికి రాగా సర్పంచ్ రేవూరి సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. నృత్యాలు, కోలాటాలతో నిట్ విద్యార్థులను గ్రామానికి ఆహ్వానించారు.

ఆదర్శ గ్రామ ఏర్పాటే లక్ష్యం : రమణారావు
మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా సమస్యలతో సతమతమవుతున్న గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నిట్ విద్యార్థులు, అధ్యాపకులు పల్లె బాట పట్టినట్లు నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. మొదటిరోజు గ్రామాన్ని సందర్శంచి గ్రామంలోని స మస్యలను గుర్తించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని లెలిపారు. ఇందులో భాగంగానే మొదటి రోజు గ్రామంలోని నిరుపేదలను గుర్తించి 200 మంది చెద్దుర్లు, దోమ తెరలను అందజేసినట్లు తెలిపారు. అనంతరం గ్రామంలోని మెగా వైద్య శిబిరం నిర్వహించి గ్రామంలోని జ్వర పీడితులను, వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి వ్యై పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీన్ ఎల్‌ఆర్‌జీ రెడ్డి, రిజిస్ట్రార్ గోవర్ధన్‌రావు, జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఆర్డీవో రవి, డీపీవో నారాయణరావు, ఎంపీపీ కాట్ల కోమల, వైస్ ఎంపీపీ పల్లాటి జైపాల్‌రెడ్డి, ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రావు, ఎంపీడీవో గుంటి పల్లవి, తహసీల్దార్ జగన్మోహన్‌రెడ్డి, డీఎల్‌పీవో వెంకటేశ్వరు, ఎంపీవో హరిప్రసాద్, ఎంపీటీసీ అరుణ పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...