ఎంజీఎంలో జాతిపిత జయంతి


Thu,October 3, 2019 02:41 AM

ఎంజీఎం : జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను బుధవారం ఎంజీఎం దవాఖానలో ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఓపీ గేటు సమీపంలోని గాంధీ విగ్రహానికి సూపరింటెండెంట్ డాక్టర్ బత్తుల శ్రీనివాసరావు పూలమాల వేసిన నివాళులర్పించగా కార్యక్రమంలో దవాఖాన డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ మోహన్ దాస్, డాక్టర్ జేవీరావు, నర్సింగ్ సూపరింటెండెంట్ స్వరూపారాణి, ఆర్‌ఎంవోలు డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ సాంబరాజు, ఆఫీసు సూపరింటెండెంట్ ఇస్మాయిల్, రాష్ట్ర ఫార్మసీ ఉత్తమ అవార్డు గ్రహిత టీఎల్‌ఎన్ స్వామి, పిడియాట్రిక్స్ విభాగం అధిపతి డాక్టర్ విజయ్‌కుమార్‌తోపాటు ఇతర శాఖలకు చెందిన అధికారులు, వైద్యులు, స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ శ్రీనివాసరావు గాంధీ పోరాట పటిమను కొనియాడుతూ మాట్లాడారు. ఇదిలాఉంటే జనరల్ నర్సింగ్ స్కూల్‌లో గాంధీ జయంతి వేడుకలను జరుపుకున్నారు. ప్రిన్సిపాల్ ఎల్ సతీశ్‌కుమారి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్క రూ గాంధీ చూపిన మార్గంలో పయనిస్తూ రోగులకు నిసా ్వర్ధ సేవలందించాలని కోరారు. ఓపిక, సహనం మనిషిలోని ఉన్నతిని గుర్తు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం లో ట్యూటర్లు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...