మహా నగరానికి సరికొత్త మాస్టర్ ప్లాన్


Sat,September 21, 2019 03:00 AM

-సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ పోచంపల్లి
- వారం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర..!
-మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో మంత్రి కేటీఆర్ కీలక భూమిక
- మారనున్న వరంగల్ మహానగర రూపురేఖలు

వరంగల్, నమస్తేతెలంగాణ: మహా నగరానికి సరికొత్త మాస్టర్‌ప్లాన్. దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడనుంది. ఓరుగల్లు జనుల కలలు సాకారం కాబోతున్నాయి. నాలుగు దశాబ్దాల క్రితం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌తో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనుగుణంగా మారుతున్న నగర అభివృద్ధికి పాత మాస్టర్‌ప్లాన్ అడ్డంకిగా మారింది. రోజురోజుకూ విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలన్న దానిపై గత ప్రభుత్వాలు దృష్టి సారించిలేదు. నగరాభివృద్ధికి కొత్త మాస్టర్‌ప్లాన్ ఆవశ్యకతను గుర్తించలేదు. నగర ప్రజలతో పాటు ప్రజాసంఘాలు చేసిన డిమాండ్లకు ప్రాధాన్యతనివ్వలేదు. దీంతో నాలుగు దశాబ్దాల పాత మాస్టర్ ప్లాన్ అమల్లో ఉండటంతో మారిన నగరంలో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు. తెలంగాణ సర్కారు కొలువుదీరిన వెంటనే వరంగల్ కొత్త మాస్టర్‌ప్లాన్‌పై దృష్టి సారించింది. 2041 లక్ష్యంగా సరికొత్త ప్లాన్‌ను రూపొందించారు. అప్పటి డిప్యూటీ సీఎం కడియంతో పాటు అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్‌లు మాస్టర్‌ప్లాన్‌పై ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ప్రజ లు, మేధావుల నుంచి సలహాలు, సూచనలు తీ సుకొని మాస్టర్ ప్లాన్‌కు తుదిరూపం ఇచ్చారు. ఐ దు నెలల క్రితం హైదరాబాద్‌లో జరిగిన కుడా బోర్డు సమావేశంలో వరంగల్ కొత్త మాస్టర్‌ప్లాన్‌కు ఆమోదం తెలిపి ప్రభుత్వానికి పంపించార

వారం రోజుల్లో ఆమోద ముద్ర
కొత్త మాస్టర్‌ప్లాన్‌కు వారం రోజుల్లో ప్రభుత్వం ఆమోదముద్ర వేయనున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. 2041 లక్ష్యంతో రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ను గత జూన్ నెలలో ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. అయితే అనివార్య కారణాలతో ప్రభుత్వం కొత్త ప్లాన్‌కు ఆమోదం ముద్ర వేయలేదు. ప్రస్తుతం పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే వరంగల్ కొత్త మాస్టర్ ప్లాన్‌పై దృష్టిసారించినట్లు సమాచారం. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో మంత్రి కేటీఆర్ కీలక భూమిక పోషించారు. ప్రత్యేకంగా కుడా కార్యాలయంలో మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష నిర్వహించారు. అనేక సార్లు హైదరాబాద్‌లో కొత్త మాస్టర్‌పై సమీక్షా సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. వరంగల్ కొత్త మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో కీలక భూమిక పోషించిన కేటీఆర్ మళ్లీ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో మాస్టర్‌ప్లాన్‌కు త్వరలోనే ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం.

సుదీర్ఘ కసరత్తు
వరంగల్ నగర దశాదిశను మార్చే మాస్టర్‌ప్లాన్‌పై అధికారులు సుదీర్ఘ కసరత్తు చేశారు. సుమారు రెండేళ్లు మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో నిమగ్నమయ్యారు. అనేకసార్లు సమావేశాలు, సమీక్షల అనంతరం మాస్టర్‌ప్లాన్-2041 తుది రూపం ఇచ్చారు. కొత్త మాస్టర్‌ప్లాన్ ప్రతీ సిటిజన్‌కు చేరాలన్న సంకల్పంతో అధికారులు కుడా మాస్టర్ ప్లాన్ పేరిట యాప్‌ను రూపొందించారు. ఇది దేశ చరిత్రలోనే అర్బన్ అథారిటీ సంస్థ ప్రత్యేకంగా యాప్ రూపొందించడం ప్రప్రథమం. మాస్టర్‌ప్లాన్ ప్రతీ ఒక్కరికి అర్థం అయ్యేలా డివిజన్ వారీగా మాస్టర్ ప్లాన్ మ్యాప్‌లను రూపొందించారు. సామాన్యుడు తమ స్థలం ఏ జోన్‌లో ఉందో సులభంగా తెలుసుకునేలా డివిజన్ మ్యాప్‌లతో ప్రజల వద్దకు తీసుకెళ్లారు. దీనితోపాటు ప్రజల నుంచి కొత్త మాస్టర్‌ప్లాన్‌పై ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరారు. దీంతో సుమారు 3 వేల సలహాలు, సూచనలు వచ్చాయి. దీనిపై నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ప్రతీ సలహాలను పరిశీలించారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత భావితరాల భవిష్యత్ కోసం కొత్త మాస్టర్‌ప్లాన్‌కు రూపకల్పన చేశారు.

ఫలించనున్న ఎర్రబెల్లి, పోచంపల్లి కృషి
నాలుగు నెలలుగా కొత్త మాస్టర్ ప్లాన్ ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉండటంతో ఆమోద ముద్ర కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ రాజయ్య పలుమార్లు సమావేశం అయ్యారు. మాస్టార్ ప్లాన్ అనివార్యతను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సర్కారు వరంగల్ మాస్టర్ ప్లాన్‌పై దృష్టిసారించింది. అతి త్వరలోనే కొత్త మాస్టర్ ప్లాన్‌కు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనుంది..!

145
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...