దరఖాస్తుల ఆహ్వానం


Sat,September 21, 2019 02:55 AM

అర్బన్ కలెక్టరేట్, సెప్టెంబర్ 20: పరిశ్రమల స్థాపన కోసం జిల్లాలోని గిరిజన విద్యావంతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి పోచం ఒక ప్రకటనలో తె లిపారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజన విద్యావం తులకు ఉపాధి కల్పించేందుకుగాను సీఎం ఎంటర్‌ప్రిన్యూయర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీంను ప్రా రంభించిందన్నారు. అర్హులైన గిరిజన ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పరిశ్రమల స్థాపనలో వినూత్న ఆలోచనలు కలిగి ఉన్నవారు, అత్యున్నత సాంకేతిక విద్యావంతులు అర్హులన్నా రు. ఏ విభాగంలోనైనా పట్టభద్రులైనవారు (ఏజెన్సీ ప్రాంతాల వారికి మినిహాయింపు ఉంది), 2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. అలాగే పీవీటీజీఎస్ వారి కి, కొత్తగా ఏర్పాటు చేయాలనుకొనే వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఆన్‌లైన్‌http;//twd.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడవని ఆయన పేర్కొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...