కాజీపేటలో నమ్మించి మోసం


Sat,September 21, 2019 02:55 AM

కాజీపేట, సెప్టెంబర్ 20: ఫ్లిప్‌కార్టు సంస్థలో పని చేస్తున్న వ్యక్తి నమ్మించి మోసానికి పాల్పడడంతో బాధితుడు కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కాజీపేట ఎస్సై దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. దర్గా కాజీపేట బంధంచెరువు సమీపంలోని ఫ్లిప్‌కార్టు గోదాంకు ఇన్‌చార్జీగా వరంగల్ నగరాకి చెందిన అడ్డగుడి ప్రభు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అతని వద్ద దాదాపు పది మంది ఎగ్జిక్యూటీవ్ బాయ్స్ పనులు చేస్తారు. ప్రభు ఎప్పటిలాగే ఎగ్జిక్యూటివ్ బాయ్స్ ఇచ్చిన నగదు రూ.1,47,900ను గోదాం లాకర్‌లో ఈనెల 18న రాత్రి పెట్టినట్లు తెలిపారు. షెట్టర్‌కు తాళం, ఆఫీస్ బిల్డింగ్ తాళంను సీసీ కెమెరాల ముందు పెట్టానని ఈ విషయాన్ని తమ వద్ద ఎగ్జిక్యూటీవ్‌గా పని చేస్తున్న లద్దునూరి అనిల్‌కు చెప్పి ఇంటికి పోయినట్లు తెలిపారు. ఈ నెల 19న చెట్ల శ్రీధర్ ఆఫీస్‌కు వచ్చి చూడడంతో షెట్టర్ మొయిన్ డోర్ తాళం దొరకలేదని ఈ విషయాన్ని మా ఇంటికి వచ్చి తెలుపడంతో మరో తాళం ఇచ్చి పంపానని బాధితుడు తెలిపారు.

శ్రీధర్ ఆఫీస్‌కు వచ్చి తాళం తీసేసరికి సేఫ్ లాకర్ తెరిచి ఉందని, సీసీ కెమెరా డీవీఆర్ తీసేసి ఉందని సెల్ ఫోన్‌లో సమాచారం అందించారని చెప్పారన్నారు. ప్రభు ఆఫీస్ వచ్చి చూసేసరికి లాకర్‌లో పెట్టిన రూ.1,47,900లు, సీసీ కెమెరాల డీవీఆర్ లేదని, ఆఫీస్‌కు తాళం వేసినప్పుడు తనతో పాటు ఉన్న ఆరూరి అనిల్‌కు ఫోన్ చేయడంతో సెల్ స్విచ్చాఫ్ వస్తుందని తెలిపారు. తమ వద్ద నమ్మకంగా పని చేసి అదును చూసి నగదుతో పాటు సీసీ కెమెరా డీవీఆర్‌ను మోసపూరితంగా దొంగిలించి ఉంటాడని బాధితుడు అడ్డగుడి ప్రభు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడు ప్రభు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...