సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన సేవలందించాలి


Sat,September 21, 2019 02:54 AM

-జీ ఇస్రో సైంటిస్ట్ జరానా
హసన్‌పర్తి, సెప్టెంబర్ 20: సాంకేతిక పరిజ్ఞానంతో సమాజానికి మెరుగైన సేవలందించాలని జీ-ఇస్రో సైంటిస్ట్ జరానా ఇంజినీరింగ్ విద్యార్థులకు సూచించారు. మండలంలోని అనంతసాగర్ ఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో కళాశాల ఐట్రీపుల్‌ఈ స్టూడెంట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో రెండు రోజుల ఆర్-స్పాక్ సదస్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీ వంటివి ప్రస్తుతం ఎంతో మార్పులతో అన్ని రంగాల్లో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ అంశాలు ముఖ్యంగా మెడికల్ రంగానికి ఎంతో మేలు చేకూర్చుతుందన్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ విద్యార్థులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని టెక్నాలాజీలో వస్తున్న మార్పులను తెలుసుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు.

టీసీఎస్ డిజిటల్ ఇనిషియేటివ్ హెడ్ బాలప్రసాద్ మాట్లాడుతూ.. డీప్ లర్నింగ్ అంశంతో యంత్రాలు, పరికరాలు, వాటంతట అవే పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటాయన్నారు. ఈ అంశంలో ప్రస్తుతం ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఐట్రిపుల్‌ఈ ద్వారా విద్యార్థులు, వారి తోటి విద్యార్థులు, నిపుణుల ద్వారా ఎన్నో అంశాలు నేర్చుకొని నూతన సాంకేతికతతో వస్తు తయారీని సమాజానికి ఉపయోగపడేవిధంగా రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీ మహేశ్, డైరెక్టర్ డాక్టర్ సీవీ గురురావు, డీన్ డాక్టర్ సయ్యద్‌ముస్తాక్‌అహ్మద్, ఐట్రిపుల్‌ఈ విభాగం హెడ్ డాక్టర్ జే తరుణ్‌కుమార్, కౌన్సిలర్ చక్రధర్, బ్రాంచ్ చైర్మన్ నిహారిక, వైస్ చైర్మన్ అచ్యుత్‌కుమార్, శశిఫాల్గున్, మేఘన, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...