వాజేడు ఏజెన్సీలో పోలీసుల హై అలర్ట్


Fri,September 20, 2019 02:56 AM

వాజేడు, సెప్టెంబర్, 19 : వాజేడు ఏజెన్సీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. వాజేడు మండలంలోని మొరుమురు గ్రామపంచాయతీ పరిధిలోని ఘణపురం,మోట్లగూడెం గ్రామాల మధ్యలోని ప్రధాన రహదారిపై, కల్వర్టు వద్ద గురువారం మావోయిస్టు కరపత్రలు ఉదయం వెలిశాయి. ఈ క్రమంలో అటువైపు వెళ్లిన వారు కరపత్రాలను గమణించి పోలీసులకు సమచారం ఇవ్వడంతో వారు వాటిని తొలగించారు. అనంతరం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. కాగా, రహదారిపై పెద్ద ఎత్తున కరపత్రలు వెలవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 8వ తేదీవరకు 15వ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని తెలంగాణ రాష్ట్ర కమిటీ భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్ట్)పేరిట కరపత్రలు వెలిశాయి.

పోలీసుల వాహన తనిఖీలు..
మావోయిస్టు కరపత్రాలు వెలసిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్ద్దు ప్రాంతం పేరూరు పోలీసు స్టేషన్ పరిధిలోని హైదరాబాద్, భూపాలపట్నం 163 జాతీయ రహదారి పై టేకులగూడెం ,చండ్రుపట్ల గ్రామాల మధ్యలో పేరూరు ఎస్సై రాందేని స్వామి ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు సాగించిన ప్రయాణికుల బ్యాగులు తీసి సోదాలు చేశారు. అనుమానితులను ప్రశ్నించారు. వాహన ధ్రువపత్రాలు లేని వాహన దారులకు జరిమానాలు విధించారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...