చెరువులో పడి వ్యక్తి మృతి


Fri,September 20, 2019 02:56 AM

వాజేడు,సెప్టెంబర్,19: చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని అయ్యవారిపేటలో గురువారం చోటుచేసుకుంది. పేరూరు ఎ స్సై రాందేని స్వామి కథనం ప్రకారం మండలంలోని అయ్యవారిపేట గ్రామానికి చెందిన కావిరి శేషరావు(30) తన పశువులను మేపేందుకు బుధవా రం ఊరిచివరకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి నీటిలో మునిగి మృతి చెం దాడు. శేషరావు ఇంటికి రాకపోవడంతో బంధువు లు వెతకగా గురువారం ఉదయం చెరువులో మృతిచెంది కనిపించాడు. దీంతో మృతుడి సోదారుడు ఈశ్వర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...