శాస్త్ర విజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలి


Fri,September 20, 2019 02:56 AM

అర్బన్ కలెక్టరేట్, సెప్టెంబర్ 19: విద్యార్థులు శాస్త్ర విజ్ఞానంపై అవగాహన పెంచుకుని, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సెక్టోరల్ అధికారులు మనోజ్‌కుమార్, వేణుఆనంద్ తెలిపారు. జిల్లాలోని 76 పాఠశాలల విద్యార్థులకు రసాయన మూలకాల ఆవర్తన పట్టిక-మానవ సంక్షేమంపై హంటర్‌రోడ్డులోని సైన్స్‌సెంటర్‌లో గురువారం ముగింపు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూలకాల ఆవర్తన పట్టిక కూర్పు ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడుతుందన్నారు. ప్రతీ మూలకం మానవ మనుగడకు తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. సైన్స్‌సెంటర్ ప్రాజెక్టు అధికారి హేమంత్‌కుమార్ మాట్లాడుతూ సైన్స్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులు పెంపొందుతాయని, ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు రీజనల్ సైన్స్‌సెంటర్ ముందుంటుందన్నారు. కాగా రాష్ట్ర స్థాయిలో జరిగే సెమినార్‌కు ఏకశిల టెక్నోస్కూల్ విద్యార్థి ఎస్ వంశీ ఎంపికైనట్లు జిల్లా సైన్స్ అధికారి సురేశ్‌బాబు తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా సత్యనారాయణ, అరుణ, సందీప్‌కుమార్, సదానందం వ్యవహరించారు. కార్యక్రమంలో పూర్వ జిల్లా సైన్స్ అధికారి కేశవరావు, సైన్స్ సెంటర్ నుంచి సాంబశివరెడ్డి, వెంకటేశ్వర్‌రావు, రమేష్, రాంగోపాల్‌రెడ్డి, ప్రవీణ్, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...