కేడీసీలో పోషకాహారంపై అవగాహన సదస్సు


Fri,September 20, 2019 02:55 AM

రెడ్డికాలనీ, సెప్టెంబర్ 19: హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాళలలో గురువారం మహిళా సాధికార సమితి ఆధ్వర్యంలో మహిళా శిశుసంక్షేమం, వికలాంగుల సౌజన్యంతో మన ఆహారంలో పోషక విలువల ఆవశ్యకత అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్ పాము వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం వల్ల పోషకాలను పొందవచ్చునని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి సబితా మాట్లాడుతూ నేడు ఎంతో మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, తక్కువ ఖర్చుతో పోషకాలను పొందవచ్చునని తెలిపారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వాణిశ్రీ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రిసోర్స్‌పర్సన్ స్వాతి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమతుల ఆహారంపై వివరించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఇందిర, డీడబ్ల్యూవో సబితా, వాణిశ్రీ, నైనాదేవి, రమాదేవి, అనిత, అధ్యాపకులు విజయలత, కవిత, కుమారస్వామి, మురళీధర్, విద్యార్థులు పాల్గొన్నారు

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...