వ్యాయామ విద్య కళాశాల విద్యార్థినులకు అభినందనలు


Fri,September 20, 2019 02:55 AM

రెడ్డికాలనీ, సెప్టెంబర్ 19: కేయూ వ్యాయామ విద్య కళాశాల విద్యార్థినులు ఇటీవల ఎల్బీ కాలేజీలో జరిగిన ఇంటర్ కాలేజీయేట్ టోర్నమెంట్ మహిళా విభాగంలో హ్యాండ్‌బాల్‌లో మొదటిస్థానం, ఖోఖోలో ద్వితీయ స్థానం సాధించినట్లు కేయూ వ్యాయామ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టీ రవీందర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కేయూ నుంచి సౌత్‌జోన్‌కి వెళ్లే టీంలో హ్యాండ్‌బాల్ నుంచి మంజుల, కళ్యాణి, మానస, ఖోఖో నుంచి సింధు, మౌనిక, కృష్ణకుమారి, కబడ్డీలో స్రవంతి, మౌనిక, గోదావరి అదేవిధంగా హ్యాండ్‌బాల్ కోచ్ భాస్కర్, ఖోఖో కోచ్ కిరణ్‌గౌడ్, కబడ్డీ కుమార్‌ను వ్యాయమ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టీ రవీందర్‌రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో నాన్‌టీచింగ్ సిబ్బంది యాకుబ్ రెహమాన్, విజయ్, విద్యార్థులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...