రైల్వే అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడాలి


Fri,September 20, 2019 02:55 AM

-ఏరియా మేనేజర్ పూర్ణచందర్‌రావు
కాజీపేట, సెప్టెంబర్ 19: ఆల్ ఇండియా రైల్వే ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ అభివృద్ధ్దికి కార్మికులు పాటుపడాలని కాజీపేట రైల్వే జంక్షన్ ఏరియా మేనేజర్ పూర్ణచందర్‌రావు అన్నారు. కాజీపేటలో ఆల్ ఇండియా రైల్వే ఎస్సీ,ఎస్టీ అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ ఏర్పడి 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యదర్శి కేఎన్ రావు అధ్యక్షతన గురువారం డైమండ్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణచందర్‌రావు నీలిరంగు జండాను ఆవిష్కరించి, మాట్లాడుతూ కేంద్ర రైల్వే ఎస్సీ,ఎస్టీ కమిటీ పిలుపు మేరకు భారతీయ రైల్వేలోని అన్ని కార్యాలయాల్లో డైమండ్ జూబ్లీ వేడుకలను జరుపుకుంటున్నామని తెలిపారు. రైల్వే ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ హక్కుల సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో భారతీయ దళిత సాహిత్య అకాడమీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జితేందర్ మను, రైల్వే అధికారి సీఎంపీఈ ప్రసాద్, డివిజన్ అదనపు కార్యదర్శి వీరన్న, శ్రీనివాసరావు, ఎంఎల్ నారాయణ, హరిబాబు, మురళీకృష్ణ, పూల్‌సింగ్, బైరవరెడ్డి, శ్రీనివాస్, నాగరాజు, సుభాష్, నరేష్, వెంకటేశ్వర్లు, కేఎన్ నాయక్, చంద్రమౌళి, కుమారస్వామి, ఎల్లయ్య, అతీష్, రైల్వే కార్మికులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...