దంచికొట్టిన వాన


Thu,September 19, 2019 03:11 AM

-కుండపోత వర్షంతో నగరం జలమయం
-ప్రధాన రహదారుల్లో నిలిచిన నీరు

నగరం సాగరమైంది. రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. నగరంలోని ఏ కాలనీని చూసిన ఏ గల్లీలోకి వెళ్లినా ఇదేపరిస్థితి. మంగళవారం రాత్రి, బుధవారం కురుసిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ వర్షపునీటితో నిండి చెరువుల్లా కనిపించాయి. రోడ్లన్నీ జలమయం అవ్వడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
వరంగల్ క్రైం : ఒక్కసారిగా దంచికొట్టిన వర్షం తాకిడికి నయీంనగర్‌లోని కాలనీలు జలదిగ్భందం అయ్యాయి. పుష్పాంజలి ఫంక్షన్‌హాల్ ఎదుట కరీంనగర్ ప్రధాన రహదారి నీళ్లతో నిండింది. కిషన్‌పుర, పోచమ్మకుంట, సమ్మయ్యనగర్, సుందరయ్యనగర్, కేయూ క్రాస్‌రొడ్డులోని దారులపై ప్రజలు నడవటానికి ఇబ్బందులుపడ్డారు. మోకాళ్ల లోతు వర్షపునీటిలో పాఠశాల, కళాశాల విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ నడుచుకుంటూ వెళ్లారు. 40వ డివిజన్‌లో భారీగా కురిసిన వర్షం కారణంగా భారీ వృక్షం నెలకొరిగింది.
రెడ్డికాలనీ : ఒక్కసారిగా భారీ వర్షంకురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మురుగుకాలువలు నిండిపోయి రోడ్లపైకి నీళ్లు చేరాయి. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సుమారు అరగంటకుపైగా జోరుగా వర్షం కురిసింది. సాయంత్రం పాఠశాలలు వదిలే సమయానికి భారీ వర్షం పడడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. హన్మకొండ రెడ్డికాలనీలోని బాసిత్‌నగర్ స్కూల్ వర్షపు నీటితో నిండింది.

మోకాళ్ల లోతులోంచి విద్యార్థులు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడే నీళ్లు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వర్షం దంచికొట్టడంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. భారీ వర్షం కారణంగా చెట్లు కూలిపోయాయి. నగరంలోని కాలనీలు, ప్రధాన రహదారులు నీటమునిగాయి. హన్మకొండ బస్టాండ్, చౌరస్తా, శ్రీదేవి ఏషియన్ మాల్ రోడ్లు నీటితో నిండిపోయాయి. దీంతో అటువైపు నుంచి వెళ్లే బస్సులు, వాహనదారులు, ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. బాటసారులు రోడ్డు మధ్యలోని డివైడర్ల ద్వారా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సిద్ధార్థనగర్ : పొద్దంత ఉక్కపోతతో సతమతమైన జనం ఒక్కసారిగా తడిసి ముద్దయ్యారు. చిటపట చినుకులు జోరుగా కురవడంతో హోరువానలో రహదారులు జలదిగ్భంధంలో కూరుకుపోయాయి. ఎటు చూసిన వరద ప్రవాహంలా సాగిపోతూ జనం నడవడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. బుధవారం సాయంత్రం హటాత్తుగా మబ్బులు కమ్ముకుని జోరువాన అందుకోవడంతో సిద్ధార్థనగర్ పరిసర ప్రాంతాల్లో జలమయమయ్యాయి. ప్రధానంగా వడ్డెపల్లిలోని భవానీనగర్‌లో, సర్యూట్ గెస్ట్‌హౌస్, హన్మకొండ పబ్లిక్‌గార్డెన్ ఎదుట బస్‌స్టేషన్ సమీపంలో వాన నీరు భారీగానిలిచి, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాయంత్రం సమయంలో కురవడంతో పాఠశాలల విద్యార్థులకు వాహనదారులకు ఇబ్బంది ఎదురైంది.

కాశీబుగ్గ : నగరంలోని కాశీబుగ్గ, ఏనుమాముల, దేశాయిపేట్, ఎల్‌బీనగర్ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయంగా మారాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కాశీబుగ్గ చౌరస్తా, తిలక్‌రోడ్డు, నర్సంపేట్‌రోడ్డు, మార్కెట్ రోడ్డులు జలమయంగా మారాయి. దీంతో స్థానికులు వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.

ఐనవోలు : మండలంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి చెరువు, కుంటలకు భారీ నీరు చేరుకుంది. పున్నేల్ క్రాస్ నుంచి పెద్దపెండ్యాల క్రాస్ వరకు ఇటీవల డబుల్ రోడ్డు వేయడంతో వెంకటాపురం గ్రామంలో రోడ్డును అనుకొని ఉన్న ఇండ్లు లోతట్టుగా మారాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రామంలోని సుమారు 50 ఇండ్లల్లోకి వర్షాపు నీరు చేరుకుంది. చాలా ఇండ్లు కూలీ పోయే పరిస్థితి ఉందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...