యాదాద్రి శిల్పులకు సన్మానం


Thu,September 19, 2019 03:08 AM

రెడ్డికాలనీ, సెప్టెంబర్ 18 : విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని యాదాద్రి ఆలయ నిర్మాణంలో పనిచేస్తున్న స్తపతులు, ఉపస్తపతులను బుధవారం ఘనంగా సన్మానించారు. జాతీయ సంప్రదాయ చేతి వృత్తుల సమాఖ్య ఆధ్వర్యంలో యాదాద్రిలోని శ్రీలక్ష్మీనరసింహాస్వామి శిల్పకళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాదాద్రిలో పనిచేస్తున్న స్తపతులు, ఉపస్తపతులను, శిల్పులను సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, విశ్వకర్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అడ్లూరి రవీంద్రచారి ఘనంగా సన్మానించారు. యాదాద్రి నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రజల మన్ననలు పొందుతోందని అన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు గుగ్గిళ్ల రాజేంద్రప్రసాద్, శ్రీరామోజు విద్యాధర్, మహేశ్వరం బాబురావు, డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధ్దన్, అడ్లూరి లక్ష్మణ్‌రావు, ఉపస్తపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...