మంత్రి హరీశ్‌రావును కలిసిన బొమ్మినేని


Thu,September 19, 2019 03:07 AM

కాశీబుగ్గ, సెప్టెంబర్18: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావును బుధవారం హైదరాబాదులో తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అద్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం కాటన్ ఇండస్ట్రీస్ సమస్యలపై మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రీస్ ఎదుర్కొంటున్న సమస్యలపై మెమోరాండం ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా ఆర్సీఎం (రివర్స్ చార్జీ మెకానిజమ్)ను తీసివేయాలని కోరారు. కాటన్ ఇండస్ట్రీస్‌కు రావాల్సిన పెండింగ్ ఇన్సెంటీవ్స్‌ను రిలీజ్ చేయాలని మంత్రిని కోరారు. ఇండస్ట్రీయల్ పాలసీలో కాటన్ ఇండస్ట్రీస్ టాక్స్ బెనిఫిట్ రావాలంటే ఫాం-ఏ, సేల్స్ టాక్స్ డిపార్టుమెంట్ వారు ఇవ్వాలని కోరారు. ఆర్సీఎం విధానం వల్ల కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంట్ వారు ఇవ్వడం లేదని ఆయన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో జీఎస్టీ, సేల్స్‌టాక్స్ కమిషనర్ అధికారులతో మాట్లాడి సమస్యలను వివరించినట్లు తెలిపారు. ఆర్‌బీఐ గైడెన్స్ ప్రకారం సిక్ అయిన ఇండస్ట్రీస్ ఎన్‌పీఏ కాకుండా రిస్ట్రిక్టుర్ చేయాలని కోరారు. వెంటనే ప్రభుత్వ నుంచి బ్యాంకులకు లేఖ రాస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. సమస్యలకు సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్‌రావు 20న గోవాలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో చర్చిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కక్కిరాల రమేష్, కోశాధికారి చల్లా శ్రీధర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి నాగభూషణం, మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...