గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుకుందాం


Wed,September 18, 2019 02:17 AM

ఖానాపురం, సెప్టెంబర్ 17 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంచేసి గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుకుందామని జిల్లా కలెక్టర్ హరిత పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం మండలంలోని ఖానాపురం, కొత్తూరు, రాగంపేట గ్రామాల్లో 4గంటల పాటు వాడవాడల, దళిత కాలనీల్లో తిరుగుతూ పారిశుధ్య పనులను ప ర్యవేక్షించారు. మొదట మండల కేంద్రంలో చేపట్టిన పారిశుధ్య పనులను పరిశీలించా రు. మేజర్ గ్రామపంచాయతీ జనాభా ఎక్కువగా ఉన్న గ్రామం కాబట్టి పనులను వేగవంతంగా చేయాలన్నారు. నేను వస్తున్నానని పనులు చేయడం కాదు.. ప్రజల కోసం చేపట్టాల అని అన్నారు. గ్రామంలో నడుస్తున్న పనుల తీరును సర్పంచ్ చిరంజీవిని అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి రెండు వైకుంఠ దామాలు కావాలని సర్పంచ్ కోరగా ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసే వైకుంఠధామాన్ని ఈజీఎస్‌లో పూర్తిచేసుకోవాలని ఆర్‌అండ్‌బీ స్థలంలో ఏర్పాటుచేసే దానికోసం అధికారుల అనుమతి తీసుకుందామని తెలిపారు.

కొత్తూరు గ్రామ పరిశీలన..
కొత్తూరును సందర్శించి గ్రామ కూడలిలో ప్లాస్టిక్ ఏరివేతకు ఏర్పాటు చేసిన బ్యాగ్‌లను పరిశీలించారు. బ్యాగ్‌లు చిన్నవిగా ఉన్నాయని పెద్దవి ఏర్పాటు జీపీ సిబ్బందికి సూచించారు. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం ఎదుట ప్లాస్టిక్ బాటిళ్లు ఉండడంతో వాటిని వెంటనే తొలగించాలన్నారు. ప్లాస్టిక్‌ను కాల్చొద్దని సూచించారు. ప్లాస్టిక్‌ను కాల్చితే వచ్చే పొగ చాలా ప్రమాదకరమని ఊపిరితిత్తులు పాడవుతాయని హెచ్చరించారు. గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. గ్రామాల్లో నీటి నిల్వ ఉన్న సైడ్ డ్రైనేజీలను, గుంతలను వెంటనే పూడ్చివేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ కాలనీలో మురుగు నీరు నిల్వ ఉండడంతో ఇంటి యజమానులు వాటిని పూడ్చివేసుకోవాలని సూచించారు. నిరూపయోగంగా ఉండి కూలిన ఇళ్లకు నోటీసులు ఇచ్చి కూల్చివేయాలన్నారు. అంబేద్కర్ భవనం నిరూపయోగంగా ఉండి పిచ్చిమొక్కలు మొలవడంతో వెంటనే భవనాన్ని మహిళా సంఘాలకు కేటాయించాలని సర్పంచ్‌ను ఆదేశించారు. దుర్గామల్లేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ విశిష్టతను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పరిసరాలు బాగున్నాయని అన్నారు. ప్రాథమిక పాఠశాల తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల ప్రతిభపై సంతృప్తి వ్యక్తం చేశారు.

రాగంపేట గ్రామ సందర్శన ..
రాగంపేట గ్రామానిన కలెక్టర్ సందర్శించి వాటర్ ట్యాంక్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జీపీ కార్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాల ఆవరణలోనే నిర్మించుకోవాలని అందుకు జీపీ తీర్మానం చేసి నివేదికను తనకు పంపించాలని సర్పంచ్‌కు సూచించారు. అనంతరం హరిత మాట్లాడారు. నెల రోజుల ప్రణాళిక కార్యాచరణలో మొక్కలు నాటడం, ఇనుప విద్యుత్ స్థంబాలు, వంగిపోయిన స్థంబాలను తొలగించి నూతన స్థంబాలను ఏర్పాటు చేయడం, థర్డ్ వైర్‌ను ఏర్పాటు చేయ డం జరుగుతందన్నారు. ఇదంతా జీపీ నిధులకు సంబంధం లేకుండా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామానికి వైకుంఠధామం ఉండాలన్నారు. వైకుంఠ ధామలను ప్రభుత్వ స్థలాల్లో నిర్మించేకోవాలని ప్రభుత్వ స్థలం లేకపోతే జీపీ నిధులతో కొనుగోలు చేసుకోవాలన్నారు. డంపింగ్ యార్డులను నిర్మించుకోవాలన్నారు. పారిశుధ్య పనులు చేపట్టుకోవడం ప్రధానమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే నూతన పంచాయతీ రాజ్‌చట్టం ప్రకారం జరిమానాలు విధించనున్నట్లు హెచ్చరించారు. మండలంలోని గ్రామాల్లో జరుగుతన్న పారిశుధ్య పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తొలగించిన పిచ్చి మొక్కలను రోడ్లవెంట కుప్పలుగా వేయకుండా డంపింగ్ యార్డ్‌కు తరలించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మంచి సమన్వయంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పనిచేయని సర్పంచ్‌ల, అధికారులపైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాకాలలో బో టింగ్ నిలిచిపోవడంపై సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటానన్నారు. నూతనంగా మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వ పథకాలు లేవన్నారు. గ్రామాల్లో ఎందరికి మరుగుదొడ్లు లేవో త్వరలో వాస్తవ సర్వే చేయిస్తానని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, జెడ్పీటీసీ బత్తిని స్వప్న, సర్పంచ్‌లు బూస రమ, భాషబోయిన అయిలయ్య, శాఖమూరి చిరంజీవి, డీఆర్డీవో ఏపీడీ పరమేశ్వర్, ఎంపీడీవో రవి, తహసీల్దార్ ముంతాజ్, ఏపీవో సుధాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, ఎంఈవో మాలోత్ దేవా, కొలిశెట్టి పూర్ణచందర్‌రావు, మల్యాల పోశెట్టి, కాసు యాకయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...