అసైన్డ్ భూ సమస్యపై.. అసెంబ్లీలో గళమెత్తిన పెద్ది


Wed,September 18, 2019 02:16 AM

నర్సంపేట, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 17 : నర్సంపేట పట్టణంలో అసైన్డ్ భూముల క్ర మబద్ధీకరణకు అసెంబ్లీలో మంగళవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గళమెత్తారు. దశాబ్ధాల తరబడిగా పట్టణ ప్రజలకు ప్ర ధాన అవరోధంగా నిలుస్తున్న సర్వే నం బర్ 111, 702లలో నివాసం ఉంటు న్న పేదల ఇళ్ల స్థలాలపై మాట్లాడారు. ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం కేసీఆర్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే పెద్ది అసెంబ్లీలో మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలి దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణమని, దీనికోసం ప్రత్యేకమైన నిధులను గతం లో గతంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేటాయించారన్నారు. న ర్సంపేట మున్సిపాలిటి అభివృద్ధికి ఆటంకం కలిగించే ప్రధాన సమస్యల్లో ప్రభుత్వ సర్వే నంబర్ 111, 702తో కూడిన భూమి విస్తీర్ణం అధికంగా ఉండి అసైన్డ్ భూమిగా గుర్తించబడి ఉండడమేనన్నారు. పట్టణంలో 8,700 ఇళ్లు ఉంటే అందులో 3,900 ఇళ్లు ప్రభుత్వంచే అసైన్డ్ చేయసిన భూమిలోనే ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 58, 59 జీవోలు ఇచ్చినప్పటికీ కేవలం 58 జీవోకు అనుగుణంగా 668 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసుకున్న వివరించారు. ఎంతో మంది పేదలు పట్టణానికి వలసవచ్చి తెలిసో తెలియక ఇళ్ల స్థలాలను కొనుకున్నారని, అవి అసైన్డ్ భూములుగా గుర్తించబడిన వాటిలో ఉండటంతో బ్యాంకు రుణాలు, ఇతర అవసరాకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ సమస్యను గ తంలో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. నర్సంపేట పట్టణంలో ఎంతో మంది దారిద్యరేఖకు దిగువన ఉంటూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఒక ప్రత్యేకమైన జీవో ద్వారా నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ అసైన్డ్ భూముల ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను కోరారు. ఈ విషయమై సీఎం, కేటీఆర్‌లు సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలోనే శుభవార్త వింటారని, అసైన్డ్ భూమి సమస్య నుంచి విముక్తి లభిస్తుందని పెద్ది ఆశాభావం వ్యక్తం చేశారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...