దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలి


Wed,September 18, 2019 02:15 AM

-వాట్సప్ ద్వారా పోలీసుల సూచన
శాయంపేట : దొంగతనాలపై మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. మంగళవారం శాయంపేట పోలీసులు వాట్సప్ వేదికగా ప్రజలకు సూచనలు జారీ చేశారు. మండలంలోని పత్తిపాక గ్రామంలో ఇటీవల ముస్లిం దంపతుల ఇంటిలో బంగారు అభరణాలు, వెండి పట్టీలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ఇదే గ్రామంలో పాల వ్యాపారి ఇంట్లో బంగారు చైన్ చోరీ జరిగింది. వరుస చోరీలతో భయంతో జనాలు ఇండ్లు వదలడం లేదంటున్నారు. అంతకు ముందు సూరంపేట, గట్లకానిపర్తి ఆలయాల్లో హుండీలను పగులగొట్టి డబ్బులు దోచుకెళ్లిన ఘటనను గుర్తుచేశారు.. ఇదిలా ఉంటే గ్రామాల్లో కేటుగాళ్లు వృద్ధులు, అమాయకులను మోసం చేస్తున్నారు. పత్తిపాకలో ముస్లిం వృద్ధ్ద దంపతుల ఇంటికి వచ్చిన కొందరు డబ్బులు ఇప్పిస్తామని నమ్మించి వారి నుంచి నగదును కాజేసి పారిపోయారు. బంగారం ఎత్తుకెళ్లేప్రయత్నంచేయడంతో అడ్డగించారు. జోగంపల్లిలో పిల్లలు లేని దంపతులను ఆయుర్వేద మందులతో పిల్లలు కలిగేలా చేస్తామని నిమ్మించి రూ.11వేలు, మొబైల్ తీసుకుని పరారయ్యారు. సీసీ కెమెరాల ద్వారా వారిని పోలీసులు పట్టుకున్నారు. అలాగే తాజాగా శాయంపేటలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరగడంతో కేసు నమోదు చేశారు. గత కొన్ని నెలల క్రితం మైలారానికి చెందిన ఒకరి నుంచి సైబర్ నేరగాడు రూ.12లక్షల వరకు దోచేసిన ఘటన కూడా జరిగింది. దీంతో పోలీసులు అప్రమత్తమై సోషల్ మీడియాలో ప్రజలకు సూచనలు జారీ చేశారు. శాయంపేట మండలంలో పదిహేను రోజులుగా పగటిపూట దొంగతనాలు జరుగుతున్నాయని రైతులు పనులకు వెళ్లినప్పుడు, ఇండ్లకు తాళవ వేసి ఉంటే దొంగలు పగులగొట్టి బంగారం, డబ్బు ఎత్తుకువెళ్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఇంటి వద్ద ఒకరిని తప్పకుండా కాపలా పెట్టి వెళ్లాలని సూచించారు. కాలనీలో ప్రతి వాడకు ఒకరు రక్షణగా ఉండేటాచూడాలన్నారు. ఎక్కువ రోజులు ఇంటి నుంచి బయటకు వెళితే శాయంపేట పోలీస్‌స్టేషన్‌కు ఫోన్‌ద్వారా సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇంటికి తాళం వేసి వెళ్తే విలువైన వస్తువులు ఉంచవద్దని సూచించారు. అపరిచితులు ఫోన్ చేసి ఏటీఎం, ఓటీపీ వివరాలు అడిగితే చెప్పవద్దని తెలిపారు. ప్రతి ఒక్కరు ఇంటి ఆవరణలో, గ్రామ కూడళ్లలో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని శాయంపేట పోలీసులు కోరారు. కొత్త వారు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలనిపేర్కొన్నారు

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...