విధులు బాధ్యతతో నిర్వర్తించాలి


Wed,September 18, 2019 02:15 AM

-ఉపాధిహామీ సమీక్షలో డీఆర్డీవో సంపత్‌రావు
నర్సంపేట రూరల్, సెప్టెంబర్ 17 : ఉపాధి హామీ సిబ్బంది విధులను బాధ్యతతో నిర్వర్తించాలని విధులపై నిర్లక్ష్యం వహించొద్దని డీఆర్డీవో సంపత్‌రావు అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ డివిజన్ స్థాయి క్లస్టర్ రివ్యూ సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి ముఖ్యఅతిథిగా డీఆర్డీవో సంపత్‌రావు, అడిషనల్ పీడీ పరమేశ్వర్ హాజరయ్యారు. తొలుత ఆయా మండలాల్లో జరిగిన ఉపాధి హామీ పనుల పురోగతిని సంబంధిత ఏపీవో, ఎఫ్‌ఏ, టీఏ, ఈసీలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంపత్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకరంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. గ్రామాల్లోని ప్రజలకు పారిశుధ్యం పై ప్రత్యేక అవగాహన కల్పించాలని కోరారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఉపాధి హామీకి సంబంధించిన పనులు గుర్తించి చేపట్టాలని పేర్కొన్నారు. ముఖ్యంగా శాశ్వతమైన, మంచి పనులకు తొలుత ప్రాధాన్యతనివ్వాలని, పథకం ఫలాలు నిరుపేదలకు అందేలా ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు సంబంధించిన రైతుల బిల్లులు వెంటనే చెల్లించాలని తెలిపారు. లేబర్ బడ్జెట్‌ను పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ్ర మహిళా సంఘాల సభ్యులు స్వచ్ఛందంగా ప్రణాళికలో భాగస్వాములు అయ్యేలా చూడాలన్నారు. ్ర పతి మహిళా తన ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా కృషి చేయాలని పేర్కొన్నారు. భూగర్భజలాలు పెంచేందుకు ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. గ్రామాల్లో ప్లాస్టిక్‌కు పూర్తిగా రూపుమాపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ తోట శ్రీనివాస్‌రావు, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు, ఈసీలు, టీఏలు, ఎఫ్‌ఏలు తదితరులున్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...