కార్యాచరణ ప్రణాళికలో ప్రజలు భాగస్వాములు కావాలి


Wed,September 18, 2019 02:15 AM

చెన్నారావుపేట, సెప్టెంబర్17 : ముప్పై రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో గ్రామాల్లోని ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా అటవీశాఖాధికారి, మండల స్పెషలాఫీసర్ పురుషోత్తం కోరారు. మంగళవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గ్రామ స్పెషలాఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌అసిస్టెంట్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపుల ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. అలాగే, హరితహారంలో భాగంగా మొక్కలను విరివిగా నాటించాలని సూచించారు. పారిశుధ్యంపై దృష్టి సారించి, ప్రజలు రోగాల బారిన పడకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

పలు గ్రామాలను సందర్శించిన డీఎఫ్‌వో...
మండలంలోని అమీనాబాద్, ఖాదర్‌పేట, పత్తినాయక్‌తండా గ్రామాలను డీఎఫ్‌వో పురుషోత్తం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులను పరిశీలించారు. అనంతరం అమీనాబాద్‌లో ఆయన మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ బాదావతు విజేందర్, జెడ్పీటీసీ బానోతు పత్తినాయక్, తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో కొర్ని చందర్, మండల పంచాయతీ అధికారి సురేశ్, సూపరింటెండెంట్ దయాకర్, ఎస్సై విఠల్, స్పెషలాఫీసర్లు అరుణ, సత్యనారాయణ, సర్పంచ్‌లు సిద్ధన రమేశ్, అనుముల కుమారస్వామి, జాటోతు స్వామినాయక్, పంచాయతీ కార్యదర్శులు బాలకిషన్, వీరన్న, నిట్టు, వార్డు సభ్యు లు మురహరి వంశీకృష్ణ, మరాటి రవి, ఎరుకల రాజ్‌కుమార్, తోట రమేశ్, మేడి సుధాకర్, నార్లాపురం ఐలయ్య పాల్గొన్నారు. కాగా, అక్కల్‌చెడలో పారిశుధ్య పనులను సర్పంచ్ తూటి పావని ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డుకిరువైపుల పిచ్చి మొక్కలను తొలగించారు. కార్యక్రమంలో తూటి రమేశ్, స్పెషలాఫీసర్ సంపత్, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, ఉపసర్పంచ్ బానోతు వీరన్న, హెచ్‌ఎం రవిచంద్ర, కారోబార్ కరెడ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...