అక్రమ దత్తత తీసుకుంటే చర్యలు


Wed,September 18, 2019 02:14 AM

-జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేందర్‌రెడ్డి
శాయంపేట, సెప్టెంబర్ 17 : అక్రమంగా దత్తత తీసుకుంటే చర్యలు తప్పవని జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని నేరేడుపల్లి గ్రామానికి చెందిన దంపతులు అక్రమ దత్తత తీసుకున్న ఉదంతంపై మంగళవారం విచారణ జరిపినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సీడబ్ల్యూసీ కమిటీ ఎదుట పాపను తల్లిదండ్రులకు అందజేసినట్లు తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నల్లబెల్లి గ్రామానికి చెందిన దంపతులకు మూడో కాన్పులో ఆడపిల్ల జన్మించింది. అయితే వారికి ఆడపిల్లలను సాకే స్తోమత లేకపోవడంతో శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామానికి చెందిన దంపతులకు దత్తత ఇచ్చారు. ఈ విషయంపై విచారణ చేపట్టి దత్తత తీసుకున్న దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. పిల్లలను అక్రమంగా దత్తత తీసుకోవడం చట్టదీత్యానేరమని అన్నారు. దీని వల్ల మూడు సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. అక్రమంగా దత్తత తీసుకున్న పాప లేదా బాబుకు వంశ పారంపర్యంగా వచ్చే ఆస్తులలో హక్కులు వర్తించవని తెలిపారు. చట్ట ప్రకారం దత్తత తీసుకున్నప్పుడు మాత్రమే వారసత్వపు హక్కులు లభిస్తాయన్నారు. పాపను కన్న తల్లిదండ్రులు, పెంచుకున్న తల్లిదండ్రులను కోర్టు ముందు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సీడబ్ల్యూసీ చైర్మన్ పరుశరాములు మాట్లాడుతూ.. సీఏఆర్‌ఏ నిబంధనల ప్రకారం దత్తత తీసుకోవాలన్నారు. సీడబ్ల్యూసీ కమిటీ మెంబర్లు బాలరాజు, మంజుల సమక్షంలో పాపను కన్న తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు. ఇది మొదటి తప్పుగా భావించి వదిలిపెట్టామని పాపను కన్న తల్లిదండ్రుల నుంచి ఎలాంటి పరిస్థితుల్లోనూ వేరు చేయకూడదని అలా చేస్తే చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విచారణలో బాలల సంరక్షణ అధికారి రాజు, హరికృష్ణ, కౌన్సిలర్ నర్సింహస్వామి, సోషల్ వర్కర్ రాజ్‌కుమార్, చైల్డ్ లైన్ మెంబర్ ప్రవీణ్, సునీల్ ఉన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...