మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి


Tue,September 17, 2019 03:12 AM

నర్సంపేట రూరల్, సెప్టెంబర్ 16: మహిళా సంఘాల్లోని సభ్యులంతా ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఐకేపీ ఏపీఎం కుందేళ్ల మహేందర్ అన్నారు. సోమవారం మండలంలోని గురిజాల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మహిళా సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఐకేపీ ఏపీఎం మహేందర్ మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థ మొత్తం ఆ ఇంటి మహిళ మీదనే ఆధారపడి ఉందన్నారు. మహిళలు స్వయం ఉపాధిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని, వాటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలు కుటుంబ బాధ్యతతోపాటు ఇతర ఆదాయ వనరులపై శ్రద్ధ సారించాలని సూచించారు. మహిళా సంఘాల సభ్యులు పలు రకాల రుణాలను ప్రభుత్వం అందిస్తుందని, వాటిని ఎక్కువ ఆదాయ వనరులకే కేటాయించాలని పేర్కొన్నారు. సంఘం సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సంఘ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ గొడిశాల మమత, ఉప సర్పంచ్ మంచిక హరీశ్, వార్డు సభ్యులు, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

తరలివెళ్లిన టీఆర్‌ఎస్ శ్రేణులు
గిరిజన, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా సత్యవతిరాథోడ్ బాధ్యతలు స్వీకరిస్తున్నారనే విషయం తెలుసుకున్న జిల్లాలోని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. డోర్నకల్ నియోజకవర్గంలోని కురవి, మరిపెడ, నర్సింహులపేట, డోర్నకల్, చిన్నగూడురు, దంతాలపల్లి మండలాల నాయకులు పెద్ద ఎత్తున హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. సత్యవతి రాథోడ్‌కు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు చెప్పారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...