ప్లాస్టిక్ నిర్మూలనకు కృషిచేయాలి : ఇన్‌చార్జి కమిషనర్


Tue,September 17, 2019 03:12 AM

నర్సంపేట, నమస్తే తెలంగాణ: ప్లాస్టిక్ నిర్మూలనకు కృషిచేయాలని నర్సంపేట మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్, ఏఈ సతీశ్ కోరారు. సోమవారం నర్సంపేట మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంపై మహిళలకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మూడో విడతలో భాగంగా జాతిపిత మహాత్మాగాంధీ 150 జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం 11 సెప్టెంబర్ 2019 నుంచి 27 అక్టోబర్ 2019 వరకు కొనసాగుతుందని అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాలను నిషేధించాలని కోరారు. ప్లాస్టిక్ బ్యాగ్స్, టీకప్పులు, గ్లాసులు వినియోగం వల్ల పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆదోళన వ్యక్తం చేశారు. 50 మైక్రాన్ల మందం గల ప్లాస్టిక్ బ్యాగ్స్‌ను వాడాలని కోరారు. వినియోగదారులు కూడా ప్లాస్టిక్ సంచులను అడగకుండా ఉండాలని అన్నారు. ప్రతీ ఒక్క మహిళ ప్లాస్టిక్‌పై అవగాహన కలిసి ఉండాలని కోరారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణ దెబ్బతింటుందని, ప్లాస్టిక్ భూమిలో ఏళ్ల తరబడి కరుగకుండా ఉంటుందని అన్నారు. ప్లాస్టిక్ వాడకం పెరగడం వల్లే పెద్ద జబ్బులు వస్తున్నాయని ఆయన వివరించారు. ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగులు, క్లాత్‌బ్యాగ్స్, జీవ శైథిల్య బ్యాగులను ఉపయోగించాలని సూచించారు. పట్టణంలో చెత్తను ఎక్కడ పడితే వేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వివరించారు. ఈగలు, దోమలు వ్యాప్తి చెంది వ్యాధులబారిన పడుతున్నారని తెలిపారు. ఇంటి నుంచి వెలువడే తడి, పోడి చత్తను వేరు చేసి మున్సిపాలిటీ సిబ్బందికి అందించాలని, అలా కాకుండా సరిసరాల్లో చెత్తను వేయడం తగదని అన్నారు. సమావేశంలో ఉదయ్‌కుమార్, సంపత్‌కుమార్, మధు, సంతోశ్, ఖాజబీ, హేమలత, మాధవి, సీఎల్‌ఆర్‌పీ, ఆర్పీలు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...