మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం


Tue,September 17, 2019 03:11 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 16 : మండలంలోని నల్లబెల్లి గ్రామానికి చెందిన శ్రీపెరంబదూర్ మధుసూదన్‌స్వామి కుటుంబానికి చాత్తాద శ్రీవైష్ణవ సంఘం ప్రతినిధులు సోమవారం ఆర్థిక సాయం అందించారు. నల్లబెల్లి గ్రామానికి చెందిన మధూసూదన్‌స్వామి ఇటీవల అకాల మరణం చెందాడు. ఆయన కుటుంబ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఉన్నదని తెలుసుకున్న సంఘం జిల్లా, రాష్ట్ర కమిటీ బాధ్యులు నల్లబెల్లికి వచ్చి ఆయన కుటుంబానికి రూ.20వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు దాస్య ం రంగనాథ్‌స్వామి మాట్లాడుతూ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు అశ్వాపురం వేణుమాధవ్ రూ.10వేలు, జిల్లా కమిటీ ద్వారా మరో రూ.10వేలను మొత్తంగా రూ.20వేల ఆర్థిక సాయాన్ని మధుసూదన్‌స్వామి కుటంబానికి వర్ధన్నపేట జెడ్పీటీసీ సభ్యులు మార్గం భిక్షపతి సమక్షంలో అందించామని చెప్పారు. ఆయన వెంట సంఘం బాధ్యులు కరుణాకర్, శేషగిరిస్వామి, వెంకటేశ్వరస్వామి, రాము, సురేశ్ తదితరులు ఉన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...