దేవాదుల ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ బంగారయ్య


Sun,September 15, 2019 03:36 AM

భీమారం,సెప్టెంబర్14: విద్యార్థులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిశోధనలు చేయాలని దేవాదుల ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బంగారయ్య పేర్కొన్నారు. భీమారం కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీర్స్ డేను పురస్కరించుకుని శనివారం లెక్చర్ ఆన్ లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ చాలెంజెస్ అనే అంశంపై సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా దేవాదుల ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ బంగారయ్య హాజరై మాట్లాడుతూ ప్రాజెక్టుల్లో సాంకేతికతను పరిపూర్ణంగా అమలుచేసినప్పుడు నిర్మాణపనుల్లో నిజస్వరూపం బయటపడుతుందన్నారు. ప్రతి విద్యార్థి డెడికేషన్, కమిట్‌మెంట్‌తో పని చేస్తేనే గొప్ప ఇంజినీర్‌గా ఎదుగుతారని అన్నారు. అధునిక ఇసుక తయారీకి సాంకేతికపైన పరిశోధనలు చేయాలని ఆయన విద్యార్థులకు సూచించారు. అనంతరం బంగారయ్యను సన్మానించారు.

పీసీబీ సదస్సు ముగింపు..
కిట్స్‌లో రెండు రోజుపాటు జరిగిన పీసీబీ డిజైన్ అండ్ ఫాబ్రికేషన్ సదస్సు శనివారం ముగిసింది. ఈ సదస్సులో కిట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ పోఫెసర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అధునిక సాంకేతికమైన మెళకువలను, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. మానవళికి అవసరమైన పరిశోధనలు చేయాలన్నారు. వర్క్‌షాపులో ప్రోగ్రాం సీఈసీ విభాగాధిపతి ప్రొఫెసర్ జీ రఘోత్తంరెడ్డి కన్వీనర్ డాక్టర్ రాజు, భాస్కర్, సుధీర్‌రెడ్డి, వేణు, పవన్, డాక్టర్ సౌజన్య, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...