జాతీయ లోక్ అదాలత్‌లో 772 కేసులు పరిష్కారం


Sun,September 15, 2019 03:36 AM

వరంగల్‌లీగల్, సెప్టెంబర్ 14: జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లాలోని వివిద న్యాయస్థానాల్లో 772 కేసులను రాజమార్గం ద్వారా పరిష్కరించామని న్యాయ సేవా సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి డీవీ నాగేశ్వర్‌రావు తెలిపారు. శనివారం జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈద తిరుమలాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి తిరుమలదేవి మాట్లాడుతూ రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలనుకునే వారి కోసం న్యాయ సేవా సంస్థ ఎప్పుడూ సహకరిస్తుందన్నారు. జిల్లాలో లోక్ అదాలత్ విజయవంతం కోసం 18 వేదికలను ఏర్పాటు చేశామన్నారు. ఈ లోక్ అదాలత్‌లో 668 సివిల్, క్రిమినల్ కేసులు, 105 బ్యాంకు లావాదేవీల సంబంధిత కేసులను పరిష్కరించామన్నారు. కేసుల పరిష్కారం కోసం వచ్చిన కక్షిదారులకు లయన్స్ క్లబ్ ఆఫ్ అదాలత్ వారు 1000 మందికి అన్నదానం చేశారు. అదాలత్ శాఖ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వినోద్‌కుమార్‌ను ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు అభినందించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జీలు జయకుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జితేందర్‌రెడ్డి, వేణుగోపాల్, గవర్నమెంట్ ప్లీడర్ సోమేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...