నేడు విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక


Sun,September 15, 2019 03:35 AM

రెడ్డికాలనీ, సెప్టెంబర్ 14: ములుగురోడ్డులోని గాయత్రి డిగ్రీ కళాశాలలో ఆదివారం విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రుద్రోజు గణేష్, ఐల ప్రవీణ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మల్లికార్జున్‌రావు ఆధ్వర్యంలో కార్యక్రమ వెబ్‌సైట్ ప్రారంభ వేడుకలకు ముఖ్యఅతిథులుగా జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చొల్లేటి కృష్ణమాచారి, రూరల్ అధ్యక్షుడు వంగాల శాంతికృష్ణ, వీణవంక సదానందం, పబ్బోజు సత్యనారాయణ, కట్టా ఈశ్వరప్రసాద్, గజ్జెల వీరన్న, రాష్ట్ర జిల్లా సంఘాల నాయకులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. వివిధ డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్ నాయకులు, సంఘాభిమానులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...