ముగ్గురు హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి


Sat,September 14, 2019 02:36 AM

-పోస్టింగ్ కల్పిస్తూ సీపీ ఉత్తర్వులు
వరంగల్ క్రైం, సెప్టెంబర్13 : కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి కల్పించడంతో పాటు వెంటనే పోస్టింగ్ ఇస్తూ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ శుక్రవారం ఉత్వర్వులు జారీ చేశారు. మిల్స్‌కాలనీ పీఎస్‌లో పనిచేస్తున్న సదానందంగౌడ్‌కు ఏఎస్సైగా పదోన్నతి కల్పించి సుబేదారికి బదిలీ చేయగా, నర్సంపేటలో పనిచేస్తున్న కే రాజయ్యకు పదోన్నతి కల్పించి అక్కడే పోస్టింగ్ ఇచ్చారు. సిద్దిపేట పీఎస్‌లో పని చేస్తున్న కే రమేశ్‌కు పదోన్నతి కల్పించి అక్కడే పోస్టింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన సిబ్బంది సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన విధుల్లో రాణిస్తూ ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సీపీ ఈ సందర్బంగా సిబ్బందికి సూచించారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...