జిల్లా సహకార బ్యాంకులో 15మందికి ఉద్యోగాలు


Sat,September 14, 2019 02:35 AM

సుబేదారి, సెప్టెంబర్ 13: ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో నూతనంగా 15 మంది అసిస్టెంట్ మేనేజర్లుగా నియమకమయ్యారు. డీసీసీబీలో ఖాళీగా ఉన్న 16 అసిస్టెంట్ బ్యాంకు మేనేజర్ల పోస్టుల భర్తీకి జనవరిలో రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెరిట్ 1:5 ప్రాతిపదికన ఈ నెల 3,4 తేదీల్లో హన్మకొండ అదాలత్‌లోని డీసీసీబీ కార్యాలయంలో వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి 15 మందిని ఎంపిక చేశారు. వికలాంగుల కోటాలో ఖాళీగా ఉన్న ఒక పోస్టుకు అర్హత లేకపోవడంతో పెండింగ్‌లో పెట్టారు. 15 మందికి సోమవారం నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిసింది.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...