రెడ్‌క్రాస్‌లో ఫ్రీ ఫీవర్ క్లీనిక్ ప్రారంభం


Sat,September 14, 2019 02:34 AM

అర్బన్ కలెక్టరేట్, సెప్టెంబర్ 13: హన్మకొండ సుబేదారిలోని ఇండియన్ రెడ్‌క్రాస్‌లో ఉచిత జ్వర పరీక్షల కేంద్రం (ఫ్రీ ఫీవర్ క్లీనిక్)ను శుక్రవారం ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ టి. నర్సింగ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్‌క్రాస్‌లో ఉచిత జ్వర పరీక్షల కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పీ విజయచందర్‌రెడ్డి మాట్లాడుతూ జ్వర పరీక్షల కేంద్రం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉండి పరీక్షలు చేస్తారని తెలిపారు. ప్రారంభ రోజున్నే వంద మంది జ్వర బాధితులకు ఉచితంగా పరీక్షలు చేసి వారికి రెడ్‌క్రాస్ జనరిక్ మందుల షాపు నుంచి రూ.8వేల మందులు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ సుధాకర్‌రెడ్డి, కోశాధికారి నాగయ్య, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు, జిల్లా సభ్యులు పొట్లపల్లి శ్రీనివాసరావు, బొమ్మినేని పాపిరెడ్డి, డాక్టర్ విజయలక్ష్మి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నల్లా సురేందర్‌రెడ్డి, స్టేట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ కాళీప్రసాద్‌రావు, వరంగల్ తానా ప్రెసిడెంట్ డాక్టర్ రాకేష్ వద్దిరాజ్, లైఫ్ మెంబర్లు డాక్టర్ లక్ష్మీనారాయణ, పింగిళి వెంకట్‌రాంనర్సింహారెడ్డి, రమణారెడ్డి, ప్రభాకర్‌రావు, పోలిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

20
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...