వందశాతం మొక్కలు రక్షించాలి


Fri,September 13, 2019 04:02 AM

ధర్మసాగర్, సెప్టెంబర్ 12: ప్రభుత్వం నిర్ధేశించిన 30రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో నాటిన మొక్కలను వందశాతం రక్షించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం ధర్మసాగర్ మండలంలోని ధర్మపురం, కరుణాపురం గ్రామంలో ఎంపీడీవో జవహర్‌రెడ్డి అధ్యక్షతన సభలు నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదట గ్రామంలో మొక్కలు నాటారు. అనంత రం మాట్లాడుతూ.. మొక్కలకు రోజూ నీళ్లు పో యాలని, చుట్టూ ట్రీగార్డ్సు, ముళ్ల కంపను ఏ ర్పాటు చేయాలని వాచర్స్‌కు సూచించారు. గ్రా మంలో ఇప్పటి వరకు చేసిన పనుల వివరాలను ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామం లో పరిశుభ్రత పనులు, విద్యుత్ సమస్యల పరిష్కారం బాధ్యత సర్పంచ్‌పై ఉందని అన్నారు. గ్రామంలో రోజుకో వార్డు లెక్కన డ్రైనేజీలను శుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు.

ఇందుకోసం స్టాండింగ్ కమిటీలు, గ్రామ కో-ఆప్షన్ సభ్యులు బాధ్యతగా పని చేయాలని చెప్పారు. గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో, గ్రామ పంచాయతీ పరిసరాల్లో పారిశుధ్య పనులు చేయాలని సూచించారు. 30 రోజు ల ప్రణాళికలో పనులు పూర్తి చేస్తే మహిళా సంఘాల భవనం కోసం నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. ధర్మపురం గ్రామానికి సాగు నీటి కోసం తీర్మానం చేసి లేఖ ఇస్తే దేవాదుల సౌత్ కెనాల నుంచి కాల్వ నిర్మాణం కోసం ఐబీ అధికారులకు తెలియజేస్తానని చెప్పారు. గ్రామం లో డపింగ్ యాడ్స్, శ్మశాన వాటిక నిర్మాణం చేసుకోవాలని అన్నారు. కరుణాపురంలో యూత్ సభ్యులు మొక్కల పెంపకం కోసం ముందుకురావాలన్నారు. యూత్ టీమ్ సభ్యులకు గ్రీన్ బ్రిగేడ్‌గా నామకరణం చేశారు. సమావేశంలో జెడ్పీ సీఈవో, ధర్మసాగర్ మండల ప్రత్యేక అధికారి ప్రసునారాణి, తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవి, ఎంపీపీ నిమ్మ కవిత, జెడ్పీ కో-ఆప్షన్ సభ్యురాలు జుబేదాలాల్ మహ్మద్, ఈవో అండ్ పీఆర్డీ విమల, సర్పంచ్‌లు మునిగాల యాకుబ్, కలకో ట అనిల్, ఎంపీటీసీలు బైరపాక పద్మ, ఆకారపు నాగయ్య, గ్రామ ప్రత్యేక అధికారులు నాగరాజు, పవన్ కల్యాణ్, ఉప సర్పంచ్‌లు కొత్తపెల్లి అశోక్, శ్రావణి, వార్డు సభ్యులు, స్టాండింగ్ కమిటీ, గ్రామ కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...