పీడీఎస్ బియ్యం రవాణాదారుడి అరెస్టు


Thu,September 12, 2019 03:21 AM

కాజీపేట : రైళ్లలో పీడీఎస్ బియ్యంను రవాణా చేసిన కేసులో జీఆర్పీ స్టేషన్‌లో కేసు నమోదై తప్పించుకుని తిరుగుతున్న పాత నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కాజీపేట జీఆర్పీ ఎస్సై జితేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. 2017లో మహారాష్ట్రకు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రైళ్లో రవాణా చేస్తూ పలువురు పట్టుబడ్డారు. అందులో కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరుకు చెందిన కుంభం రాజేశ్ (24)పై కేసు నమోదైంది. కాగా రాజేశ్ అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. హన్మకొండ కొత్త బస్ స్టాండ్‌లో నిందితుడిని విశ్వసనీయ సమాచారం మేరకు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు జీఆర్పీ ఎస్సై తెలిపారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...