ఇద్దరి ఘర్షణలో వ్యక్తి మృతి


Thu,September 12, 2019 03:21 AM

భీమారం : కేయూ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామారంలో ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడగా ఒకరు మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. కేయూ ఎస్సై హరికృష్ణ కథనం ప్రకారం.. ఆంధ్రపదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా అల్లూరి మండలం, ఇస్కపల్లికి చెందిన ఏలూరు కొండయ్య(30) ఐదు సంవత్సరాల క్రితం హన్మకొండలోని 55వ డివిజన్ రామారంనకు బతుకుదెరువు కోసం మరో 20 కుటుంబాలతో కలిసి వచ్చాడు. ఇక్కడ ఇటుకల తయారీ చేసేందుకు వచ్చి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రామాంరలో మంగళవారం సాయంత్రం ను గందల వెంకటేశ్ అనే వ్యక్తతో గొడవపడ్డాడు. కాగా వెంకటేశ్ కొండయ్యను కర్రతో తలపై బలంగా కొట్టడంతో అతడు మృతి చెందాడు. కొండయ్య భార్య లచ్చమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కుమారై, కుమారుడు ఉన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...