పాత ఇళ్లు ఉన్నవారికి నోటీసులు


Thu,September 12, 2019 03:21 AM

ధర్మసాగర్ : మండలంలోని మల్లక్‌పల్లిలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లు ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోయే ప్రమాదంలో ఉన్న ఇంటి యాజమనులకు బుధవారం గ్రామ సర్పంచ్ మునిగెల రాజు కట్కూరి సుధాకర్, తాటికొండ చిన్న మల్లయ్య, మునిగెల కొమురయ్యలకు నోటీసులు అందజేసినట్లు చెప్పారు. గ్రామంలో శిథిలావస్థలో 8 ఇండ్లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. బుధవారం ముగ్గురికి నోటీసులు ఇవ్వగా మిగతా వారికి కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. 30 రోజుల ప్రణళికలో భాగంగా శిథిలావస్ధలో ఉన్న ఇండ్లు పరిశుభ్రంగా చేసుకోవాలని నోటీసులో పేర్కొనడం జరిగిందన్నారు. ఉప సర్పంచ్ సుధాకర్, పంచాయతీ కార్యదర్శి రావూప్, నోడల్ అధికారి దానయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రంలో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెరిగి విద్యుత్ తీగలకు ఇబ్బందికరంగా ఉండడంతో పంచాయతీ సిబ్బంది వాటిని తొలగించారు, బస్టాండ్ సమీపంలో పోచమ్మతల్లి దేవాలయం ఎదురుగా ఉన్న సైడ్ డ్రైనేజీలో పెరుకపోయిన చెత్తను తొలగించారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...