ప్రజలను భాగస్వాములు చేయాలి


Thu,September 12, 2019 03:20 AM

కమలాపూర్, సెప్టెంబర్ 11 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణలో ప్రజలను భాగస్వాములను చేయాలని మండల పంచాయతీ అధికారి రవిబాబు అన్నారు. బుధవారం మండలంలోని గూడూరు, అంబాల, కొత్తపల్లి గ్రామాల్లో పర్యటించారు. ప్రత్యేక కార్యాచరణలో చేపట్టే శ్రమదానం, డ్రైనేజీలు శుభ్రంచేయడం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన 30 రోజుల ప్రణాళికను అక్టోబర్ 5 వరకు చేపట్టాలన్నారు. గ్రామపంచాయతీ అధికారులు తూచా తప్పకుండా పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ అధికారులు, సిబ్బంది ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనులు పూర్తి చేసేందుకు చొరవ తీసుకోవాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం చేస్తే ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...