నేడు రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్


Thu,September 12, 2019 03:20 AM

కమలాపూర్ : మండల కేంద్రంలోని మహాత్మజ్యోతిభాపూలే వెనుకబడిన తరగతుల బాలుర సంక్షేమ పాఠశాలలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్‌ను గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. సైన్స్ ఫేర్‌కు జెడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, తెలంగాణ బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య భట్టు, ఆర్‌సీవో లక్ష్మినారాయణ, ఎంజెపీ కన్వీనర్లు హాజరు కానున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 500 మంది విద్యార్థులు సైన్స్‌ఫేర్‌లో పాల్గొని సైన్స్ ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...